కాలేజీలకు బస్సులు నడపాలంటూ విద్యార్థుల ధర్నా
విజయనగరం,ఆగస్ట్4(జనం సాక్షి ): తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్టీసీ డిపో ముందు బస్సులను రానివ్వకుండా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు ధర్నా చేశారు. గజపతినగరం, జామి, నెల్లిమర్ల, కోనాడా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేకపోవడం వలన కాలేజీలకు సకాలంలో రాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీలో తరగతులు మిస్సవడంతో పాటు, హాజరుపడటం లేదన్నారు. ఆర్టీసీ బస్సుల సౌకర్యం కలిగించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రాము, చింతయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.