కాళేశ్వరం అవినీతిపై కొనసాగుతున్న విచారణ
రాప్ట్ కింద పలు సమస్యల వల్లనే కుంగుబాటు
పొంతనలేని సమాధానాలపై కమిషన్ ఆగ్రహం
హైదరాబాద్,ఆగస్టు 27 (జనం సాక్షి): కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగు బాటుకు కారణం రాప్ట్ కింద పలు సమస్యల వల్ల జరిగింది అన్నట్లు మిషన్ ముందు ఇంజనీర్లు చెప్పారు. సిఖెండ్ ్గªల్స్, అలాట్మెంట్ డివియేషన్ వల్ల సమస్య వచ్చింది అన్నట్లు ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. డిజైన్ల అప్రూవల్ తర్వాత అన్నారం గ్యారేజీ మోడిఫికేషన్ జరిగిందని కమిషన్ ముందు ఇంజనీర్ ఒప్పుకున్నారు. అయితే రామగుండం ఈసీ లేఖపై మాత్రం కమిషన్ ముందు ఇంజనీర్ దయాకర్ రెడ్డి స్పష్టత లేని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. హై పవర్ కమిటీలో సీడీఓ అధికారులు సభ్యులుగా ఉన్నారు అని ఇంజనీర్లు ఒప్పుకున్నారు. డిజైన్లు తయారు చేసే ముందు సైట్ విజిట్ ఖచ్చితంగా చేయన క్కర్లేదు అని కమిషన్ ముందు వారు చెప్పారు. అన్నారం సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ మారినట్లు కమిషన్‌కు అధికారులు చెప్పారు. అయితే మేడిగడ్డ లొకేషన్ మారలేదని తాజా మాజీ ఇంజనీర్లు.. కమిషన్ ముందు స్పష్టం చేశారు. సీడీఓ ` ఎల్‌అండ్‌టీ వేరువేరుగా డిజైన్లు తయారుచేసి ్గªనైల్ అప్రూవల్‌కు అన్ని ఒకే దగ్గర చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. మూడు బ్యారేజీలకు సంబంధించి డిజైన్లలో ఎలాంటి సమస్య లేదని నిబంధనల ప్రకారమే డిజైన్లు ఉన్నాయని ఇంజనీర్లు వెల్లడిరచారు. ఇలా పొంతనలేని సమాధానాలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంజనీర్లపై జస్టిస్ పీసీ చంద్ర ఘోష్ కమిషన్ సీరియస్ అయ్యింది. పొంతనలేని సమాధానాలు చెప్పడంపై ఇంజనీర్ల తీరును తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఓపెన్ కోర్టులో భాగంగా మంగళవారం విచారణకు ఐదుగురు తాజా, మాజీ అఆక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు హాజరయ్యారు. విచారణలో భాగంగా అప్రూవల్ పొందిన తర్వాత బ్యారేజీల డిజైన్లలో మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా అని కమిషన్ ప్రశ్నించింది. డిజైన్లు అప్రూవల్ చేసే ముందు ఆ తర్వాత అన్ని నిబంధనలు పాటించారా అని ప్రశ్నించారు పీసీ ఘోష్. హై పవర్ కమిటీ నిబంధనలు కైట్రీరియా ఫాలో అయ్యారా లేదా అని ఇంజనీర్లను ప్రశ్నించారు. డిజైన్స్ అప్రూవల్ అయిన తర్వాత లొకేషన్ లలో ఏమైనా మార్పులు చేర్పులు చేశారని ప్రశ్నించారు. అన్నారం సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ మారినట్లు కమిషన్ కు చెప్పారు అధికారులు. మేడిగడ్డ లోకేషన్ మారలేదని కమిషన్ ముందు స్పష్టం చేశారు తాజా మాజీ ఇంజనీర్లు. సిడిఓ ` ఎల్ అండ్ టి వేరువేరుగా డిజైన్లు తయారుచేసి ఫైనల్ అప్రూవల్ కు అన్ని ఒకే దగ్గర చేసినట్లు తెలిపారు. మూడు బ్యారేజీలకు సంబంధించి డిజైన్లలో ఎలాంటి సమస్య లేదని నిబంధనల ప్రకారమే డిజైన్లు ఉన్నాయని ఇంజనీర్లు తెలిపారు. అయితే కమిషన్ అడిగే ప్రశ్నలకే ఎదురు ప్రశ్నలు వేయడంతో పాటు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు అఆక్ష మాజీ ఇంజనీర్లు. దీంతో కమిషన్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం వరకు ఇద్దరి ఇంజనీర్ల విచారణ ముగిసింది. కాసేపట్లో మరో ముగ్గురు ఇంజనీర్లను కమిషన్ విచారించనుంది. మరోవైపు మాజీ జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మెన్ వి ప్రకాష్ బీఆర్‌కే భవన్‌లో విూడియాతో మాట్లాడుతూ.. 37 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. రఘు, వేధిర్ శ్రీరామ్ సీడబ్ల్యూసీ అంశాలను వక్రీకరించారని తెలిపారు. తాను కమిషన్ ముందు అఫిడవిట్ దాఖలు చేశాననన్నారు. తుమ్మిడిహట్టి నిర్మాణం సాధ్యం
కాదు అని వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. తుమ్మడిహెట్టిపై కాగ్ ఆక్షేపాలను కమిషన్‌కు తెలియజేసినట్లు చెప్పారు. అఫిడవిట్ పరిశీలన తరువాత మళ్ళీ పిలుస్తామని కమిషన్ అన్నదన్నారు. నిజమైన దోషులకు శిక్ష పడాలి అనేదే తమ ఉద్దేశమని వి.ప్రకాష్ పేర్కొన్నారు.