కాళేశ్వరం దగ్గర ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

మహదేవ్‌పూర్‌: కాళేశ్వరం దగ్గర గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ఉద్ధృతి నెరిగి గత రాత్రి 9.9 మీటర్లు ఉన్న నీటి మట్టం 10.33 మీటర్లకు చేరింది. దీంతో మండలంలోని 20గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. పత్తి, వరి పంటలు నీట మునిగాయి. లొతట్టు ప్రాంతాలకు రాకపోకలు లేకపోవటంతో గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారు.