కాళేశ్వరం ప్రాజెక్టుపై కెసిఆర్ ముందుచూపు: చారి
ఆదిలాబాద్,నవంబర్8(జనంసాక్షి): తెలంగాణ వచ్చాక ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి రంగంలో ఒక విప్లవం వచ్చిందని, కాలేశ్వరంతో సాగునీటి సమస్యలకు చెక్ పడనుందని దిల్లీలో ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలచారి అన్నారు. మహారాష్ట్రతో కెసిఆర్ ముందుచూపుతో చేసుకున్న ఒప్పంద కారణంగానే అంతర్ రాష్ట్ర అనుమతులకు అడ్డంకులు లేకుండా పోయాయని అన్నారు. కెసిఆర్ తీసుకుంటున్న చర్యల కారణంగా సగునీటి రంగం గణనీయమైన పురోగతి సాధించనుందన్నారు. లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టు అనేది నలభై ఏళ్ల కలని, దీనికోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు. కానీ ఏ రోజు గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1227 కోట్లతో ఆ ప్రాజెక్టును మంజూరు చేశారన్నారు. పనులను యుద్ధప్రాతిపదికన నడిపిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది ఆదిలాబాద్ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. సదర్‌మాట్ ప్రాజెక్టు బ్యారేజీ నిర్మించాలని వచ్చిన కాంగ్రెస్ నాయకులను దండం పెట్టి విన్నవించినా లాభం లేకుండా పోయిందన్నారు. అదే కెసిఆర్ ప్రభుత్వం రూ.516 కోట్లతో సదర్‌మాట్ బ్యారేజీ నిర్మాణం చేపట్టిందన్నారు. గత మూడున్నరేళ్లలో మిషన్ కాకతీయ, జైకా, అసంపూర్తి పనులను కలిపి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షా 30వేల 840 ఎకరాలకు సాగునీరు అందించేలా చెరువులను నిర్మించామన్నారు. వీటితోపాటు ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ నాల్గో విడతలో రూ.446 కోట్లతో కొత్తగా ఖానాపూర్ నియోజకవర్గంలో 10, ఆసిపాబాద్‌లో 13, బోథ్‌లో 19, ఆదిలాబాద్‌లో 04 మొత్తం 46 చెరువుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. వీటి ద్వారా 25వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. జిల్లాలో గిరిజనేతరులు ఎదుర్కొంటున్న సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని హావిూ ఇచ్చారు. ఏజెన్సీలో గిరిజనుల చట్టాలకు లోబడి గిరిజనులకు నష్టం వాటిల్లకుండా గిరిజనేతురుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే గిరిజనేతరుల సమస్యలను రాష్ట్రముఖ్యమంత్రి ష్టికితీసుకెళ్లామన్నారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అందుకే ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని మాజీ ఎంపీ అన్నారు. సీఎం కేసీఆర్ రాష్టాభ్రివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఏర్పడిందన్నారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల మనుగడ కష్టం అన్నారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక బద్ధంగా పని చేసి నాయకులను గెలిపించుకుంటామన్నారు.