కాశీందేవ్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్‌, జనంసాక్షి: జిల్లాలోని ములుగు మండలం కాశీందేవ్‌పేట ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 ఇండ్లు తగులబడినట్లు సమాచారం. ఘటన స్థలానికి ఇంకా ఫైర్‌ ఇంజన్లు చేరుకోలేదని గ్రామస్థులు తెలిపారు.