కాశీ ఆలయంలో మోడీ విశేష పూజలు
గంగాస్నానంచేసి ప్రత్యేక జలంతో అభిషేకం
కాలభైరవ ఆలయంలో ప్రత్యేక హారతి
వారణాసి,డిసెంబర్13 (జనం సాక్షి) : కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ గంగా జలాభిషేకం చేసి భకత్‌ఇ శ్రద్దలతో పూజలు నిర్వహించారు. గంగా నదిలో పుణ్య స్నానం చేసి.. ఆ నదీ జలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. ఈ సందర్భంలో ఆలయ పూజారులు శాస్తోక్తర్రగా రుద్రాభిషేకం నిర్వహించారు. గంగా నది నుంచి నీటితో ఆలయానికి వెళ్తున్న సమయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. నది నుంచి కొంత దూరం వరకు కారులో వెళ్లి ఆ తర్వాత ఆయన నడుచుకూంటూ స్వామివారి సన్నిధికి వెళ్లారు. ఇక ఆలయ పరిసరాల్లో డమరుక స్వాగతం ఆకట్టుకున్నది.ఈ సందర్భంగా కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మోడీ. ఆ తర్వాత పవిత్ర గంగా నదిలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. నదిలో ప్రధాని పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం తన మెడలో ఉన్న జపమాలను తీసి మంత్రాలు చదువుతూ పూజలు చేశారు. నదిలో మునకలు వేశారు. మంత్రాలు ఉచ్చరిస్తూ గంగానదిలో ప్రత్యేకంగా పూజలు చేశారు ప్రధాని. గర్భగుడిలో మోదీ చేత పండితులు అభిషేకం చేయించారు. తొలుత వారు సంకల్పం చదివారు. విఘ్నేశ్వర పూజ.. బిల్వపత్రం సమర్పణ.. పంచామృత పూజ.. వస్త్రం, యజ్ఞోపవీతం సమర్పణ.. నమక.. చమకాలతో విశ్వనాథుడి ఆలయం మంత్రోచ్ఛరణతో ప్రజ్వరిల్లింది. గంగా జలంతో విశ్వనాధుడికి మోదీ అభిషేకం చేశాక నైవేద్యం సమర్పించారు. కర్పూర హారం.. కరుణావతారం అంటూ గర్భగుడిలో విశ్వనాథుడిని కీర్తించారు. పూజారులు ప్రధాని మోదీకి ఆశీర్వాదాలు అందించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మోదీ కాశీలో పర్యటిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక ’కాశీ విశ్వనాథ్ కారిడార్’ ప్రాజెక్టు స్థాపన కోసం ప్రధాని మోదీ ఢల్లీి నుంచి వారణాసి చేరుకున్నారు. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి చేరుకున్న ప్రధాని కాలభైరవుని దర్శించుకుని
ప్రత్యేక పూజలు చేశారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు వారణాసి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా తొలుత కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని ఆ వెంటనే జల మార్గం గుండా లలిత ఘాట్‌కు చేరుకుని గంగానదిలో పవిత్ర స్నానం చేశారు. అంతకు ముందు వారణాసి విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి కారులో బయలుదేరిన మోదీపై వారణాసి ప్రజలు గులాబీ పూలు జల్లుతూ, ‘మోదీ మోదీ, హర్ హర్ మహదేవ్’ నినాదాలు హోరెత్తించారు. అనంతరం కారులో విశ్వనాథ ఆలయం దారిలో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఆలయాలు, వీధులను పర్యవేక్షించారు. కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్ కారిడార్‌కు 2019లో శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి భూమి సేకరించి ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.339 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, సుందరీకరించారు. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ఓ కొత్త థామంగా ప్రజెంట్ చేయనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వారణాసికి ఈ కారిడార్‌తో కొత్త గుర్తింపు రానున్నట్లు ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. కారిడార్ ప్రాంభోత్సవం ఆ ఎన్నికల జోరును పెంచనున్నది. ఈ ప్రాజెక్టు కోసం ఆలయం చుట్టు సుమారు 300 ప్రాపర్టీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1400 మంది షాపులను, కిరాయిదారులను, ఇంటి యజమానులకు మరో చోట స్థానం కల్పించారు. పుªపరాతన కాలం నాటి ఆస్థులను తొలగిస్తున్న సమయంలో.. అక్కడ ఉన్న సుమారు 40 ప్రాచీన ఆలయాలను కూడా గుర్తించారు. అయితే ఆ ఆలయాలను మరింత శోభాయమానంగా సుందరీకంచినట్లు తెలుస్తోంది.