కాశ్మీర్‌లో ఆగని హింస

3

– 40కి చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ,జులై 17(జనంసాక్షి): జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదుల ఆందోళన శృతిమించుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం మరో 20 కంపెనీల అదనపు సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) బలగాలను పంపాలని నిర్ణయించింది. కాగా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ తీవ్రవాది బుర్హాన్‌ వనిని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన నేపథ్యంలో కశ్మీర్‌లో వేర్పాటువాదులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. గత తొమ్మిది రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. బుర్హాన్‌ వని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో వేర్పాటువాదులు చేస్తోన్న ఆందోళనలో మృతిచెందిన వారి సంఖ్య 38కి చేరింది. భద్రతా బలగాలతోపాటు పదిహేను వందల మంది గాయపడ్డారు.