కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

5

– 21 మంది మృతి

శ్రీనగర్‌,జులై 10(జనంసాక్షి): జమ్ము కశ్మీర్‌ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. హిజ్బుల్‌  ముజాహిదీన్‌ ఉగ్రవాది బర్మన్‌ వాని ఎన్‌ కౌంటర్‌ లో  మృతి చెందిన అనంతరం పోలీసులకు ఆందోళన కారులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అనంత్‌ నాగ్‌ జిల్లాలో  ఆందోళన కారులు పోలీసు వాహనాన్ని జీలం నదిలోకి తోసేయడంతో  డ్రైవర్‌ ఫిరోజ్‌ అహ్మద్‌ మృతి చెందారు. (చదవండి: భగ్గుమన్న కశ్మీరం)ముందు జాగ్రత్త చర్యగా  జమ్ముతో పాటు పాటు మరో నాలుగు జిల్లాల్లో రెండో రోజూ కర్ఫూ అమల్లో ఉంది. మెబైల్‌, ఇంటర్‌ నెట్‌ సేవలపైనా  నిషేధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు  జరిగిన అల్లర్లలో 17 మంది మృతి చెందారు. 96 మంది భద్రతా సిబ్బందితో సహా 126 మంది గాయపడ్డారు. ఆందోళన కారుల సమ్మెతో దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు,  పెట్రోల్‌ బంకులు తెరుచుకోకపోవడంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

మనోవేదనను కల్గిస్తున్నాయి

జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర   శోకాన్ని కలిగిస్తున్నాయని  ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ  ఆవేదనవ్యక్తం చేశారు. అసమాన శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఆందోళనను అదుపుచేయాలని భద్రతా సిబ్బందిని ఆమె కోరారు. హిజ్బుల్‌  ముజాహిదీన్‌ ఉగ్రవాది బర్మన్‌ వాని తమపై దాడి చేయడానికి ప్రయత్నించినందుకే అతన్ని హతమార్చాల్సి వచ్చిందని ఆర్మీ అధికారులు తెలిపారు.

అమర్‌ నాథ్‌ యాత్ర పున:ప్రారంభం:

జమ్ముకశ్మీర్‌ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో17 మంది మృతి, 200 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో అమర్‌ నాథ్‌ యాత్ర పై విధించిన నిషేధాన్ని తొలగించారు. సీఎం మెహబూబా ముఫ్తీతో ఫోన్లో   మాట్లాడి శాంతి భద్రతలపై  పరిస్థితిని సవిూక్షించిన కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఈ రోజు యాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బర్హాన్‌ ముజాఫర్‌ వానిని భద్రతా బలగాలు హతమార్చిన నేపథ్యంలో జరిగిన అల్లర్లలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాజ్‌ నాథ్‌  ట్వీట్‌ చేశారు.

బుర్హాన్‌ వనీ ఎన్‌ కౌంటర్‌ తో మొదలైన అల్లర్లలో మృతుల సంఖ్య 19కి చేరింది. 200 మందికి పైగా గాయపడ్డారు. పోలీస్‌ జీప్‌ లో వెళ్తున్న ఓ కానిస్టేబుల్‌ ను.. కొంతమంది ఆందోళనకారులు జీపుతో సహా జీలం నదిలో తోసేయడంతో ఆయన చనిపోయారని తెలుస్తోంది. మరో ముగ్గురు కానిస్టేబుళుగల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు.కుల్గాం, అనంతనాగ్‌, పుల్వామా, ట్రాల్‌,కొకెర్‌ నాగ్‌ సహా పది జిల్లాల్లో రెండో రోజూ కూడా కర్ఫ్యూ కంటిన్యూ అయింది. రేపటి వరకు బంద్‌ కు వేర్పాటువాదులు పిలుపునివ్వడంతో? భద్రతను మరింత పెంచారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులతో సీఎం మెహబూబా ముఫ్తీ అత్యవసరంగా కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కశ్మీర్‌ లో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల నేతలను కోరారు. యువకులు ఆందోళనలు జరుగుతున్న వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత వారి పేరెంట్స్‌ దేనన్నారు.కశ్మీర్‌ లో పరిస్థితిపై ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌. సీఎం మెహబూబా ముఫ్తీతో ఫోన్‌ లో మాట్లాడి? పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు. కశ్మీర్‌ పండిట్ల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు కశ్మీర్‌ లో ఆందోళనలను ఖండించారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఉగ్రవాదికి అనుకూలంగా ఆందోళన చేస్తున్నవారికి కొన్ని రాజకీయపార్టీలు మద్ధతివ్వడం కరెక్ట్‌ కాదన్నారు.కశ్మీర్‌ లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా  రెండో రోజు కూడా అమర్‌ నాథ్‌  యాత్ర  రద్దైంది. దీంతో వందలాది మంది టూరిస్టులు యాత్ర మధ్యలోనే చిక్కుకుపోయారు. అయితే? తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు.