కిడ్నీ రోగికి సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ఆర్థిక సహాయం

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 10 (జనం సాక్షి);

ఎవరికి ఏఆపద వచ్చిన రోగాలతో బాధపడుతూ కుమిలిపోతున్న వ్యక్తులను గుర్తించి తమకు తోచినంత సహాయం చేయడం సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం కర్తవ్యం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని హమాలీ కాలనీకి చెందిన భాస్కర్ వృత్తిరీత్యా మటన్ షాప్ నడుపుకుంటూ ఉండేవాడు గత కొంతకాలం క్రితం రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో డయాలసిస్ తో కాలం నెట్టుకొస్తున్న పరిస్థితులలో ఉన్న భాస్కర్ కుటుంబ సభ్యులు సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ను సంప్రదించగా స్పందించిన టీం అతని కిడ్నీ రోగంతో బాధపడుతూ మటన్ షాప్ నడవలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి 6 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులతో పాటు 36 వేల రూపాయలను గురువారము సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం సభ్యులు అతని కుటుంబనీకి అందజేశారు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ డయాల్సిస్ స్టేజీలో ఉన్న వ్యక్తికి ఆర్థిక సహాయంతో పాటు 6 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు ఇవ్వడంతో తమ కుటుంబం సోషల్ రెస్పాన్సిబిలిటీ టీంకు ఎంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం సభ్యులు రాజు, నరేష్, శ్రీరామ్, చందు, నగేష్, పరమేష్, మురళి, నాగరాజు, వెంకట్, రాముడు, అశోక్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు