కిరణ్‌ సర్కార్‌ ప్రజలను గాలికి వదిలేసింది: బీజేపీ

హైదరాబాద్‌, జనంసాక్షి: కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌ రెడ్డి విమర్శించారు. వారికి పదవులు, కుర్చీలు తప్ప ప్రజలు పట్టరన్నారు. ఎండలతో వందలాది మంది చనిపోతున్నా ఇప్పుడు ప్రజలను చైతన్యపరచడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ చూస్తే టీఆర్‌ఎస్‌కు గుబులు పుడుతోందన్నారు. ఆ పార్టీ ఎప్పటికైన కాంగ్రెస్‌లో కలిసే పార్టీ అన్నారు. ఎన్నికలకు ,ఉద్యమాలకు ముడిపెట్టడం సరికాదన్నారు.
బీజేపీ అధికారంలోని వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌. కుమార్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌ సర్టిఫికేట్‌ బీజేపీకి అవసరం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ది రాజకీయ కుటిల నీతి అన్నారు.