కీషన్ నాయక్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం.
వృద్ధులకు స్టాండ్ స్టిక్ పంపిణీ.
గోర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అద్యక్షులు రాథోడ్ ప్రకాష్.
తాండూరు సెప్టెంబర్ 20(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండల్ పటేల్ చింత తండా కు చెందిన కిషన్ నాయక్ కొన్ని రోజుల క్రితం మృతి చెందారు.
విజయాన్ని తెలుసుకొని గోర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాథోడ్ ప్రకాష్
కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.అనంతరం పటేల్ చింత తండాకు రోడ్డు విషయమై పలువురితో చర్చించి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తానని తెలిపారు. గతంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు రోడ్డు మరమ్మతులు చేయిస్తామని హామీలకే పరిమితం అయిందని విమర్శించారు. రోడ్డు లేక తండవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అనంతరం పటేల్ చింత తండా రేలగడ్డ తండా,వృద్ధులకు స్టాండ్ స్టిక్ పంపిణీ చేశారు. గతంలో ఒంటరి మహిళలకు కుట్టు మిషన్ లాక్డౌన్ సమయంలో నిత్యవసరాలు సరుకులు పంపిణీ చేశారని తాండవాసులు మీ సేవలు చాలా అమూల్యమైనది ప్రకాష్ రాథోడ్ అన్నగారికి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ జాయింట్ సెక్రెటరీ పాండు నాయక్, రమేష్ నాయక్ ,భీమ్ సింగ్ నాయక్ ,రాజు నాయక్, రేలగడ్డ తాండ ఉప సర్పంచ్ మల్యాల తదితరులు పాల్గొన్నారు.