కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు
అశ్వరావుపేట , సెప్టెంబర్ 30( జనం సాక్షి)
దసరా ఉత్సవాలు ఐదవ రోజు మహిళలకు ఇష్టమైన వారం శుక్రవారం నాడు అశ్వరావుపేట పాత రామాలయం గుడి దగ్గర ఏర్పాటు చేసిన దుర్గమ్మ నవరాత్రులు భాగంగా శుక్రవారం అంగరంగ వైభవంగా కుంకుమ పూజ ఏర్పాటు చేశారు. ఈ కుంకుమ పూజలో మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు. కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు వారు సామాగ్రి తెచ్చికొని పూజలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అలాగే బీసీ కాలనీ
జంగారెడ్డిగూడెం రోడ్డు శ్రీ సత్య సాయి బాబా ఆలయం దగ్గర
అలాగే డ్రైవర్స్ కాలనీ దుర్గమ్మ గుడి దగ్గర
మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమ పూజ ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రం బతుకమ్మలు తీసుకువచ్చి అమ్మవారు ముందు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెబుతున్నారు. రామాలయం గుడి దగ్గర నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఎంతో వైభవంగా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి బతుకమ్మలు ఆడుతున్నారు ఈ దసరా ఉత్సవాల్లో రామాలయం గుడి దగ్గర అమ్మవారి విగ్రహ దాత గోడపాటి గోవిందరాజు భార్య గోడపాటి లక్ష్మీ దంపతులచే విగ్రహాన్ని కమిటీ వారికి అందజేశారు కమిటీ నెంబర్లు ఎంతో సంతోషపడ్డారు
కమిటీ నెంబర్లు బండారి పద్మ
ఎర్రం ఝాన్సీ
గోడపటి లక్ష్మి
తిరుమల శెట్టి రాణి
బండారు ఝాన్సీ
కుమారి
రూప కుమారి
తిరుమల శెట్టి సీత రత్నం మానేపల్లి జగదాంబ
రాణి తదితరులు పాల్గొన్నారు