కుంటలు, చెరువులు నింపాలంటూ తెదేపా నేతల ధర్నా
సారంగాపూర్ గ్రామీణం: మండలంలోని బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్టు ద్వారా మంజల, గంగపల్లి గ్రామాల్లోని కుంటలు, చెరువులు నింపాలని సారంగాపూర్ ప్రధాన రహదారిపై శనివారం తెదేపా ఆధర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నేతలు రామచంద్రరావు, రాజన్న , శంకర్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.