కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తుండగా ఘోరం
` మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది తెలంగాణ వాసుల మృతి
` మినీ బస్సు సిమెంట్ ట్రక్కును ఢీకొట్టడంతో ఘటన
` తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్లి వస్తున్న మినీ బస్సు సిమెంట్ ట్రక్కు ను ఢీకొట్టిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు.. ఘటనా స్థలంలో ఏడుగురి మృతి చెందగా ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మరొకరు చనిపోయారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మృతులు నాచారంలోని కార్తికేయ నగర్, రాఘవేంద్రనగర్ వాసులుగా తెలుస్తోంది. మృతులు నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్, మల్లారెడ్డిలుగా గుర్తించారు. మొత్తం మూడు బస్సుల్లో కుంభమేళాకు యాత్రికులు వెళ్లారు.ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం 14మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఘటన స్థలానికి జబల్‌పూర్ ఎస్పీ, కలెక్టర్ చేరుకున్నారు.ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భార్రతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని.. గాయపడిన వ్యక్తి కుటుంబానికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు వెల్లడిరచారు. మృతులను హైదరాబాద్‌లోని నాచారం వాసులుగా గుర్తించారు. జబల్‌పుర్‌లోని సిహోరా సవిూపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ లోడ్‌తో వెళ్తోన్న లారీ హైవే పైకి రాంగ్ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మినీ బస్సులో చిక్కుకున్న మరికొందరు యాత్రికులను స్థానికులు కాపాడి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో 14 మంది ఉన్నారు. క్షతగాత్రులను సిహోరా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వాహనం నంబరును గుర్తించారు. మినీ బస్సు రిజిస్టేష్రన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడిరచారు.