కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు: నాయిని

e486y4ie

కరీంనగర్: కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరి పుష్కర ఘూట్లను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గోదావరి పుష్కరాలకు కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణలోని పోలీస్ స్టేషన్లన్నింటినీ అనుసంధానం చేస్తూ హైదరాబాద్ లో కమాండెంట్ కంట్రోల్ రూమ్ పేర్పాటు చేస్తామని నాయని తెలిపారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమౌతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇకపై పోలీసులకు వీక్ ఆఫ్ లు కల్పిస్తామన్నారు.