కుటుంబకలహాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
చిగురుమావిడి, జనంసాక్షి: కుటుంబకలహాల నేపథ్యంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండలో చోటుచేసుకుంది. రైతు చాడ రాంరెడ్డి. భార్య సుగుణ. కొడుకు రాజిరెడ్డి వ్యవసాయ బావి వద్ద నిన్న రాత్రి ఘర్షణకు దిగి అనంతరం ముగ్గురు పురుగుల మందుతాగారు. వీరిని స్థానికులు 108లో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.