కుటుంబకలహాలతో యువకుడి ఆత్మహత్య

మల్హార్‌: మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బోళ్ల మహేష్‌ (21) పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబకలహాలతో శుక్రవారం సాయంత్రం తన ఇంటిలోనే పురుగుల ముందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న మహేష్‌ను కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.