కుటుంబాన్ని ఆదుకోరు గుండెపోటుతో తండ్రి మృతి, అనాధగా భార్య కొడుకు
రేగోడ్/ జనంసాక్షి అక్టోబర్
గుండెపోటుతో తండ్రి మృతి చెందగా ఆ కుటుంబం ఆనాద గా మారింది. రేగోడు మండలం లోని కొత్వన్ పల్లి గ్రామానికి చెందిన వడ్ల సంగయ్య (60)మహేశ్వరి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు. ఆడపిల్లల పిల్లల కోసం ఉన్న కొంత భూమి ఇల్లు విక్రయించి పెళ్లిళ్లు చేశాడు. గ్రామంలోని రేకుల షెడ్డు లో నివాసముంటున్నారు కుమారుడు బలహీనంగా ఉండడంతో ఏ పని చేయలేక పోతాడు. వడ్ల సంగయ్య కులవృత్తి అయిన కమ్మరి, వడ్రంగి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నెల 5న వడ్ల సంగయ్య(60) గుండె పోటు తో మృతిచెందాడు. అంత్యక్రియలకు గ్రామస్తులు చందాలు వేసుకుని కార్యక్రమాన్ని ముగించారు. సంగయ్య మృతితో భార్య కుమారుడు అనాధలైయరని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు