కుట్టింది పురుగు అనుకున్నాడు కానీ పాము

0xekcj6v

కరీంనగర్: నిద్ర పోతున్న ఇంటర్ విద్యార్థిని పాముకాటు వేయడంతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కనగిర్తి గ్రామంలో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మత్స్య కుమార్ (16) సుల్తానాబాద్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల సమయంలో బుధవారం అర్థరాత్రి వరకు చదువుకుని నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయంలో కాలుకు ఏదో కుట్టినట్లు అనిపించింది.

పురుగు కుట్టి ఉంటుందని భావించిన కుమార్ అలాగే నిద్రపోయాడు. అయితే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మత్స్యకుమార్ నోటి నుంచి నురుగులు వస్తుండటంతో కుటుంబ సభ్యులు పాము కట్టిందని భావించి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మత్స్యకుమార్ మృతి చెందాడు. చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు ఇలా అర్థాంతరంగా చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.