కుట్ర పూరితం గానే మా పై దాడులుమర్రి రాజశేఖర్ రెడ్డి

కంటోన్మెంట్ న్యూ బోయిన పల్లి నవంబర్ 24 జనం సాక్షి బోయినపల్లి మర్రి రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేను గత పది రోజులకు విదేశాలలో ఉన్నాను, నా ఇంటిపై కార్యాలయం బిజెపి ప్రభుత్వం కుట్ర పూరితంగా ఐటి దాడులు చేయడం అమానుషం అని అన్నారు, ఐటి అధికారులు వ్యవహరించారన తీరుపై మర్రి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఐటీ అధికారుల వ్యవహార తీరు తమ కుటుంబాన్ని సోదాల పేరిటలకు వేధింపులకు గురిచేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.. తన కూతురిని ఐటి అధికారులు బ్యాంకు లాకర్లను తెరిచేందుకు తీసుకువెళ్లి ఇబ్బందులకు గురిచేసారని అన్నారు.. తన కూతురు,తల్లితండ్రుల పరిస్థితి చూస్తే బాధగా ఉందని అన్నారు,అధికారులు ఈ విధంగా వ్యవహరించడం దారుణమని ఐటీ అధికారులు సోదాల్లో భాగంగా తన ఇంట్లో నాలుగు కోట్ల రూపాయలు దొరికినట్లు సమాచారం ఉందని అన్నారు. గతంలో కూడా ఐటీ దాడులు జరిగినప్పటికీ ఈసారి కుట్రపూరితంగా వేధింపులకు గురిచేస్తూ ఐటి అధికారులు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పని చేశారని అన్నారు.. తమ లెక్కలు జిఎస్టి ఐటి సంబంధించి అన్ని క్లియర్ గా ఉన్నామని తెలిపారు.. విచారణకు అన్ని విధాల సహకరిస్తామని పేర్కొన్నారు.
 మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి
           ప్రెస్ మీట్
కంటోన్మెంట్ సౌజన్య కాలనీలో మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో దగ్గర మంత్రి మల్లారెడ్డి ఐటీ సోదాలు తర్వాత అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి ఇంటి వచ్చే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజశేఖర్ రెడ్డి తన ఇంట్లో రెండు కోట్ల రూపాయలు దొరికినది వాస్తవమేఅని అన్నారు,ఆ డబ్బు కాలేజీలలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి జీతాల కోసం ఇంట్లో పెట్టిన డబ్బు ఐటీ సోదాలు చేయడం రాజ్యాంగబద్ధమే ,
కానీ నా కూతురు ను తల్లి దండ్రుల కు 77 సంవత్సరాలు పైబడిన వారికి కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య అందిస్తూ డబ్బు సంపాదిస్తున్నాం. అక్రమ సంపాదన లేదు. మంత్రి మల్లారెడ్డి తన కుటుంబాన్ని ఐటి అధికారులు మానసికంగా ఆందోళన గురి చేశారు. ఐటీ అధికారులకుఅన్ని విధాల సహకరించాం. వారు మర్చిపోయిన లాప్టాప్ ను స్థానిక బోయినపల్లి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాలి. మా కుమారుడు ని హాస్పిటల్ లో చేర్పించారు అనే విషయం కూడా నాకు తెలియలేదు. ఇంత రాక్షసతంగా ఐటీ అధికారులు ప్రవర్తించారు.అక్రమ సంపాదన ఏలాంటివి మా దగ్గర లేదు,కక్షపూరితగంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం మాపై దాడులు చేస్తుంది. ఐటీ దాడులు నాకేం కొత్త కాదు ఇది మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్య పేద విద్యార్థులకు అందిస్తున్న ఏకైక సంస్థ మల్లారెడ్డి కాలేజీలో మరి లక్ష్మారెడ్డి కాలేజీల్లో బిజెపి ప్రభుత్వం ఎన్ని దాడులు చేసిన మా కేసీఆర్ మాకు అండగా ఉన్నాడు.రాబోయేది కూడా మాదే ప్రభుత్వం బి ఆర్ఎస్ తో దేశంలో చక్రం తిప్పుతాం అన్ని మల్లారెడ్డి అన్నారు.