కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం

` ఈనెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవచ్చన్న ప్రభుత్వం
` ఫోన్‌ చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికొస్తారని వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో కులగణన సర్వేలో పాల్గొనని వారి వివరాల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈనెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవచ్చని సూచించింది. కులగణన వివరాల నమోదుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 040`211 11111ను ఏర్పాటు చేసింది. ఎన్యుమరేటర్లు.. ఫోన్‌ చేసిన వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్టు అధికారులు వెల్లడిరచారు. కులగణన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదని అధికారులు లెక్కతేల్చారు.