కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ చెరువులో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని రెవెన్యూ సిబ్బంది ఈ ఉదయం చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రత మధ్య అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.