కూకట్‌పల్లిలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్, జనంసాక్షి: కూకట్‌పల్లిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయినగర్ కాలనీలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు విస్తృతంగా వ్యాపిస్తుండటంతో చుట్టు పక్కల నివాసాల్లో జనాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.