కూచిపూడి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు
కోదాడ టౌన్ జూన్ 03 ( జనంసాక్షి )
మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని భక్తఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శెట్టి సురేష్ మాట్లాడుతూ ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య,మౌలిక సదుపాయాల కల్పన ఉన్నాయని పిల్లల శారీరక మానసిక
దృఢత్వానికి ప్రభుత్వ పాఠశాలల ట్రైనింగ్ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని పిల్లలందరికీ తప్పకుండా విద్యాబ్యాసం అవసరమని అందుకు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్పించాలని అన్నారు.అనంతరం గ్రామంలో పర్యటిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా ప్రోత్సహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కీతా సుధాకర్ రావు,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పొట్టా నాగేశ్వరరావు,
ఉపాధ్యాయులు లక్ష్మా,ఉపేందర్,వెంకటరమణ,
శ్రీనివాసరావు,మోతీలాల్,చంద్రశే ఖర్,వహీద్, ప్రసాద్,