*కూచిపూడి నాట్యంలో ఉత్తమ అవార్డు పొందిన పెబ్బేరు విద్యార్థిని*

పెబ్బేరు ఆగస్టు 29 ( జనంసాక్షి ):
విద్యార్థి దశలో కృషి పట్టుదల ఉంటే అసాధ్యం కానిదంటు ఏదిలేదని నిరూపించింది పెబ్బేరు పట్టణానికి చెందిన ” రాజా సాయిచంధన “.పట్టణానికి చెందిన రాజా నవీన్,లక్ష్మీ దంపతుల  కుమార్తె  ఎడవ తరగతి చదువుచున సాయి చందన న్యూ ఢిల్లీలో తెలంగాణ భాష సంస్కృతి విభాగం వారు  నిర్వహించిన “అమృత భారత్ నాట్య విభాగంలో ఉత్తమ అవార్డు గెలుపొందడం జరిగింది. సందర్భంగా ప్రముఖులు బాలికను ఘనంగా సన్మానం చేయడం జరిగింది. తల్లిదండ్రులు సంతోష వ్యక్తం చేశారు.
ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు చదువు అనేది అంతర్గత ప్రపంచ మయితే వారి లోపల దాగి ఉన్న కళానైపుణ్యం అనేది బాహ్య ప్రపంచంగా ఉంటుంది. అటువంటి కళలను విద్యార్థులు చిన్నతనం నుంచే అలవాటు చేసుకోడం వలన విద్యార్థులు భవిష్యత్తులో అదే వారికి జీవనాధారం కలిపించవచ్చు లేదా ఇతర విద్యార్థులకు ఒక మంచి మార్గ దర్శికావచ్చని కనుక ఇటువంటి కళలను విద్యార్థులు చిన్నతనంలోనే అలవర్చుకొనేటట్లు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహం కూడా ఉందని పలువురు ప్రశంసనీయమన్నారు.