కూలిన చెట్టును తొలగిస్తున్న జెన్కో సిబ్బంది.

నాగార్జునసాగర్ (),జూలై 09,(జనం సాక్షి); నాగార్జునసాగర్ విజయపురి నార్త్ లో శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.ఈ గాలులకు చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.పైలాన్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం కు వెళ్లే దారిలో  రోడ్డుపై చెట్టు విరిగి పడడంతో కొంతసేపు జెన్కో సిబ్బందికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్వయంగా జెన్కో ఉద్యోగి సిబ్బంది కూలిన చెట్టును తొలగించుకొని రాకపోకలను పునరుద్దించుకున్నారు. కూలిన చెట్టును తొలగించిన సిబ్బంది పట్ల పై అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు.భారీ ఈదురు గాలులకు మామిడి కాయలు నేల రాలాయని స్థానికులు వాపోయారు.

తాజావార్తలు