కూలిపోయిన బీఎస్‌ఎఫ్‌ విమానం

2

– పది మంది సిబ్బంది దుర్మరణం

న్యూఢిల్లీ,డిసెంబర్‌ 22(జనంసాక్షి):  దిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ సూపర్‌కింగ్‌ విమానం టేకాఫ్‌ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 10మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది మృతి చెందారు. సూపర్‌ కింగ్‌ సంస్థకు చెందిన బీఎస్‌ఎఫ్‌ విమానం మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో దిల్లీ విమానాశ్రయం నుంచి సాంకేతిక నిపుణులతో రాంచి వెళుతుండగా గోడను ఢీకొని కూలిపోయింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది 15 శకటాలతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న ఏడుగురు అధికారులు, ముగ్గురు సాంకేతిక నిపుణులు అక్కడికక్కడే మృతి చెందినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్‌శర్మ తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఘటనాస్థలాన్ని కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరిశీలించనున్నారు. ఈ ప్రమాదం కారణంగా మంగళవారం ఢాకాలో జరగాల్సిన భారత్‌-బంగ్లాదేశ్‌ డీజీల స్థాయి సమావేశం రద్దయింది. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్‌ లోగల బాడ్పోలా గ్రామం వద్ద విమానాశ్రయ ప్రహరీ గోడకు ఈ విమానం ఢీకొనడంతో ఘటన చోటుచేసుకుంది. విమానంలో మొత్తం పదిమందే ఉన్నట్లు తెలిసింది.మంగళవారం ఉదయం 9.50గంటల ప్రాంతంలో తమకు దిగేందుకు అనుమతివ్వాలంటూ విమాన సిబ్బంది కోరారని, ఆ వెంటనే కొద్ది సేపటికే తమతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానం దించేందుకు అనుమతి ఇవ్వగానే విమానాశ్రయంలో దించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఓ గోడకు ఢీకొట్టిందని, అనంతరం అది కూలిపోయినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇది కూలిన చోటే రైల్వే లైన్‌ కూడా ఉంది. గోడను ఢీకొట్టిన విమానం అనంతరం ఓ సెఫ్టిక్‌ ట్యాంకులోకి పడిపోయిందని, అనంతరం మంటలు భారీగా వ్యాపించగా దాదాపు 18 ఫైరిరజన్లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ కూడా ఘటన స్థలి వద్దకు వచ్చి ఆప్రాంతాన్ని పరిశీలించారు.

విమాన ప్రమాదంపై ప్రధానిగ్భ్భ్రాంతి

దేశరాజధాని దిల్లీలో మంగళవారం బీఎస్‌ఎఫ్‌ సూపర్‌కింగ్‌ విమానం కుప్పకూలిన ప్రమాదంపై ప్రధాని మోదీగ్భ్భ్రాంతి వ్యక్తంచేశారు. విమాన ప్రమాద ఘటన బాధాకరమని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ సూపర్‌కింగ్‌ విమానం టేకాఫ్‌ అవుతుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 10మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది మృతి చెందారు. సూపర్‌ కింగ్‌ సంస్థకు చెందిన బీఎస్‌ఎఫ్‌ విమానం మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో దిల్లీ విమానాశ్రయం నుంచి సాంకేతిక నిపుణులతో రాంచి వెళుతుండగా గోడను ఢీకొని కూలిపోయింది. ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.