కృషి విజ్ఞానం కేంద్రం ఆధ్వర్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన కార్యక్రమం
జహీరాబాద్ అక్టోబర్ 17 (జనం సాక్షి)
పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళను ప్రోగ్రాం ను డి డి యస్ -కె వి కె ఆధ్వర్యంలో రంజోల్ రైతు వేదిక లో జరిపించడం జరిగింది. ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిధి గా ఆత్మ చైర్మన్ పెంటరెడ్డి , జాతీయ మాంస పరిశోధనా స్థానం డైరెక్టర్ డాక్టర్ బరబుద్దీన్ డాక్టర్ బసవ రెడ్డి ప్రిన్సిపాల్ సైంటిస్ట్ ఎన్ ఆర్ సి , అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ బి. బిక్షపతి నాబార్డ్ డి డి యమ్ వి. కృష్ణతేజ, చెరుకు పరిశోధన స్థానం శాస్రావేత్త విజయలక్ష్మి , స్కోప్ యన్ జి ఓ ఇంచార్జి రాజు మరియు కెవికే శాస్రవేత్తలు, రంజోల్ క్లస్టర్ ఏ ఈ ఓ ప్రదీప్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రైతులను ఉద్దేశించి ప్రసంగాన్ని కొనసాగించారు ఈ ప్రసంగం లో ఈరోజు నుండి దీవాలి వరకు అర్హులు అయినా ప్రతి రైతు కి రెండు వేల రూపాయలు జమ అవుతాయాన్ని, అంతేకాకుండా రైతులకు ఇప్పటి నుండి వ్యవసాయనానికి కావాల్సిన ఎరువులు భారత ప్రభుత్వం సింబల్ తో ఒకే చోట దొరికేలాగా చేస్తాం అని, ఇంకా రైతులు కొత్త టెక్నాలజీ లు వాడి ఎక్కువ ఆదాయలు పొందాలని ఈ ప్రసంగం ద్వారా ప్రధాన మంత్రి మోడీ వివరించారు. ఆ తర్వాత మాంస పరిశోధనా స్థానం డైరెక్టర్ డాక్టర్ బరబుద్దీన్ మాంసం నుండి వచ్చే ప్రోడక్ట్ వాటి ద్వారా ఎలా బిజినెస్ చేయాలో వివరించారు. ఆ తర్వాత డాక్టర్. బసవరెడ్డి మాట్లాడుతూ రైతులు అశోక్, రాజారత్నం అడిగిన ప్రశ్నలకు సూచనలు చేసాడు ఈ సూచనాలలో, గొర్రెల్లాలో కొత్త రకం బ్రీడ్ నారి సువర్ణ గురించి మరియు యఫ్ పి ఓ ల గురించి వివరించారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ బిక్షపతి మాట్లాడుతూ అర్హులు అయినా ప్రతి రైతు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి అని ఆలా చేసుకుంటేనే పీఎం కిసాన్ పైసల్ పడుతాయి అని వివరించారు. ఆ తర్వాత చెరుకు పరిశోధన స్థానం శాస్రావెత్త విజయలక్ష్మి చేరుకులో అంతర పంటల గురించి, ట్రాష్ మాల్చింగ్ గురించి మరియు బడ్ చీప్ గురించి వివరించారు. ఆ తరువాత నాబార్డ్ డి డి యమ్ కృష్ణ తేజ నాబార్డ్ లో ఉండే లోన్స్ గురించి వివరించారు. కె వి కె సీనియర్ సైంటిస్ట్ &హెడ్ డాక్టర్ సురేష్ దగాడే కెవికే లో జరిగే కార్యక్రమలా గురించి రైతులు సేంద్రియ వ్యవసాయం లో ఎలాంటి సందేహాలు ఉన్న సూచనాలు, సలహాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి మహిళా రైతులు, రైతులు పాల్గొన్నారు.