కృష్ణమూర్తి మృతి రాష్ర్టానికి తీరని లోటు:కడియం

వరంగల్ : స్వాతంత్య్ర సమరయోధుడు భూపతి కృష్ణమూర్తి నిన్న మృతి చెందిన విషయం విదితమే. ఇవాళ కృష్ణమూర్తి భౌతికకాయానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణమూర్తి మృతి రాష్ర్టానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కృష్ణమూర్తి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగుతాయని కడియం తెలిపారు. కృష్ణమూర్తి భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.