కెజిఎఫ్‌`2 బాక్సాఫీస్‌ షేక్‌


విజయంపై కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంత్‌నీల్‌
ఇండియన్‌ బాక్సాఫీస్‌ ను షేక్‌ చేసి… కోట్లల్లో వసూళ్లను రాబట్టిన కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 సెన్సేషన్‌ ను సృష్టించి.. అప్పుడే 100 రోజులైంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. ఓ వీడియోను షేర్‌ చేశారు. ఈ విజయం సాధించడానికి కారకులైనవారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సౌత్‌, నార్త్‌ అనే తేడా లేకుండా ప్రతీ భాషలోనూ రిలీజై… రికార్డులు బద్దలు కొట్టి.. భారతీయ సినిమాను టాప్‌ లో నిలబెట్టింది. బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.1250 కోట్ల కలెక్షన్లను సాధించి విజయ దుందుభి మోగించింది. బాలీవుడ్‌ లో సైతం ఈ మూవీ రికార్డులను క్రియేట్‌ చేసింది. ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌, యశ్‌ పర్ఫామెన్స్‌ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఓటీటీల్లోనూ ఈ మూవీ పలు భాషల్లో స్టీమ్రింగ్‌ కాగా.. అక్కడా మంచి టాక్‌ ను సొంతం చేసుకుంది. ఇక యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. రావురమేష్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రల్లో నటించారు. రవి బస్రూర్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించాడు.