కెసిఆర్‌ బాబునే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు

గతంలో జరిగిన ఎన్నికలు వేరు.. ఇప్పుడు జరగబోయే ఎన్నికుల వేరు.. ముందస్తు ఎన్నికలు ఎందుకు జరపాల్సి వస్తుందో స్పష్టత లేదు. కేవలం ఏదో కాంగ్రెస్‌ వాళ్లు సవాల్‌ విసిరారు గనక తేల్చుకుందాం రా అని ఎన్నికలకు వెళుతున్నట్లు కెసిఆర్‌ ఇచ్చుకున్న సమాధానం ఇప్పటికీ ప్రజలకు అర్థం కావడం లేదు. ఇకపోతే మరోమారు సెంటిమెంట్‌నే కెసిఆర్‌ ప్రధాన ఆయుధంగా చేసుకోబోతున్నారు. ఎపి సిఎం చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ పోతున్నారు. ఆయనను ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. సెటిలర్ల పాటిట శని అన్నారు. నిజంగా చంద్రబాబు లేదా మరెవరైనా నేతలపై ఇంతగా విమర్శలకు దిగాల్సిన అసవరం కెసిఆర్‌కు లేదు. కానీ కాంగ్రెస్‌తో టిడిపి జతకట్టడంతో జీర్ణించుకోలేని కెసిఆర్‌ తన విమర్శలను ఎక్కువగా బాబుపైనే పెట్టారు. నిజంగానే కూటమి అంటే భయం పట్టిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.  తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో అంటే 2014 ఎన్నికల్లో  సెంటిమెంట్‌ బలంగా ఉంది. ఆ  ఎన్నికల్లో అందరూ తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకున్నారు. తెలంగాణ రాష్ట్రసమితి కూడా సెంటిమెంట్‌ కారణంగా ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చింది. నాలుగున్నరేళ్ళు కూడా పూర్తి కాకుండానే మళ్లీ ఎన్నికల కోసం రాజీనామా చేశారు. ఇది ఎంతవరకు సమర్థనీయం అన్నది కెసిఆర్‌కు మాత్రమే తెలియాలి. ఎన్నికలయ్యాక అనేకమంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌ గూటికి చేర్చుకున్నారు. బలం పెంచుకున్నారు.  దాదాపు నాలుగేళ్లు గడచిపోయి, మరో పదినెలల కాలం మాత్రమే ఉందనగా 2019 మే వరకు ఆగకుండా డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడం, 105 మంది అభ్యర్థలును ఏకరంగా ప్రకటించడం ఏక కాలంలో జరిగిపోయాయి. ప్రతిపక్షాలు కూడా సై అంటున్న దశలో  తెలంగాణ సిఎం కెసిఆర్‌ ముందస్తు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌, బిజెపిలు పదేపదే తమదే అధికారం అంటూ, తమకు ఇన్నిసీట్లు అన్నిసీట్లని లెక్కులు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ అయితే ఇక అధికారంలోకి వచ్చినట్లే భావిస్తోంది. వీరి ప్రకటనలకు కెసిఆర్‌ దీటుగానే స్పందించారు. ఎట్లా గెలుస్తారో రండి చూపిస్తా. వందకు పైగా సీట్లు గెలుస్తాం అని సవాల్‌ విసిరారు. ఎన్నికలు ఎప్పుడైనా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేయడమే గాకుండా ఎన్నికలకు ముందుగా వెళ్లడానికి కూడా సిద్దమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వందకుపైగా స్థానాల్లో గెలుస్తుందని.. ఏ సర్వే చూసినా ఇవే ఫలితాలు వెలువడుతున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అంటున్నారు. అయితే మరో 9 నెలల ముందే ఇలాంటి ప్రకటన చేసిన కెసిఆర్‌కు ఇప్పుడు వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నట్లుగా ఉంది. కాంగ్రెస్‌,టిడిపిలు కలుస్తాయని ఊహించని కెసిఆర్‌ ఇప్పుడు కూటమి కారణంగా తమ గెలుపు అవకాశాలు తగ్గిపోతున్నాయన్న బెంగ పట్టుకున్నట్లుగా ఉంది. అందుకే టిడిపి అధినేత చంద్రబాబును టార్గెట్‌ చేశారు. ఓటుకు నోటుకు దొంగ అన్నారు. ఇవన్నీ ,చూస్తుంటే కెసిఆర్‌కు నిజంగానే బాబు భయం పట్టుకుందా అన్న  అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజలకు తమ ప్రభుత్వ పాలనపై పూర్తి నమ్మకమున్నదని.. అంటూనే పథకాలపై ప్రచారం కన్నా ఎదురుదాడికి టిఆర్‌ఎస్‌ ప్రాధాన్యం సి/-తోంది. గెలిచే అన్ని స్థానాల్లో 40వేల నుంచి 60 వేల ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నా, ఎక్కడా అలాంటి ధీమా కనిపించడం లేదు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఇక సెంటిమెంట్‌ పని అయిపోయింది. ఇప్పుడంతా అభివృద్ది నినాదంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ వచ్చారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. పునర్నిర్మాణం ఇతర పార్టీలకు రాజకీయమని, టీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రం అదొక టాస్క్‌ .. ఒక యజ్ఞం.. పవిత్రమైన కార్యక్రమమని తెలిపారు. కానీ మళ్లీ అంతలోనే ప్రతిపక్షంపై పదే పదే విమర్శలు గుప్పించడం ద్వారా కెసిఆర్‌ ఎందుకనో రూటు
మార్చారు. రాజకీయ పార్టీలకు తెలంగాణ ఉద్యమం చిల్లర మల్లర రాజకీయంగా కనపడ్తది. ఏదో మాములు రాజకీయంలాగా కనిపిస్తున్నది. స్వరాష్ట్రంలో ఏం చేసినా ప్రజల కోణంలోనే చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు రాజకీయాల కోసం, ఓట్ల కోసం పెట్టినవి కావని కూడా కెసిఆర్‌ కుండబద్దలు కొట్టారు.  తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు  పెడుతున్నవి తమాషా స్కీంలు కావు. పేదల బాధ నుంచి వచ్చిన పథకాలు. పేదలు ఎక్కడ ఉన్నా పేదలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అగ్రకులాల్లో ఉన్న పేదవారికి కూడా కల్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నాం. మానవీయకోణంలో ఆలోచించి పథకాలు రూపొందించాం. తెలంగాణ రాష్ట్రం పేద ప్రజల రాష్ట్రం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 85 శాతం మంది ఉన్నారు.. అగ్రవర్ణాల్లో ఐదు శాతం పేదలున్నారు. వీరందరు కలిస్తే 90 శాతం పేదలు ఉన్న రాష్ట్రం. కల్యాణలక్ష్మి అగ్రకుల పేదలకు కూడా ఇస్తున్నాం. ఇండ్లు లేనివారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్‌ సరఫరా చేయడంతోపాటుగా అన్ని వర్గాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ  నీటిని ఇవ్వబోతు న్నాం.  ఇలా పథకాలను పక్కాగా అమలు చేయడం,వాటి ఫీడ్‌ బ్యాక్‌ రావడం వల్ల కెసిఆర్‌ ధీమాగా ఉన్నట్లు ప్రకటించారు. కానీ ప్రచారంలో ఇతర పక్షాలు దిగడంతో పాటు, కెసిఆర్‌పై విమర్వల దాడి కూడా పెరిగింది. దీంతో కెసిఆర్‌ కూడా ప్రచార వ్యూహం మార్చారా అన్నది అర్థం కావడం లేదు. చంద్రబాబుకు తెలంగాణలో మునపటంత బలం లేదు. యితే ఎందుకు కెసిఆర్‌ మాటార్చరన్నది అర్థం కావాల్సి ఉంది.