కెసిఆర్ విద్యుత్ దార్శనికత !
దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యుత్ సంక్షోభం నెలకొంది. తెలంగాణ తప్ప అంతటా ఆందోళన నెలకొంది. విద్యుత్ కొరత నాయకులకు షాక్ కొట్టేలా ఉంది. బొగ్గు అలభ్యత కారణంగా ఉత్పత్తి పడిపోయిందని పలువురు సిఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ ప్రజలు మాత్రం నిరంతర విద్యుత్‌తో ఎలాటి చీకూచింతా లేకుండా ఉన్నారు. సిఎం కెసిఆర్ దక్షతకు ఇది ఓ నిదర్శనం. ఆయన ఎప్పటి నుంచో నిరంతర విద్యత్‌ను అందిస్తున్నారు. కొత్తగా ప్లాంట్‌లు ఏర్పాటు చేసి ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఎందరెందరో ఎన్నెన్నో విమర్శలు చేసినా నిరంతర విద్యుత్ విషయంలో సిఎం కెసిఆర్ వెనకడుగు వేయలేదు. తన దార్శనికతతో ఉత్పత్తి కేంద్రాలకు శ్రీకారం చుట్టారు. విద్యుత్ ఉత్పత్తి పెంచడ కోసం ఉన్న అన్ని అవకాశా లను ఉపయో గించుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు దీనిని కూడా రాజకీయం చేసి..కాంగ్రెస్ హయాంలోనే మిగులు ఉత్పత్తి సాధ్యమయ్యిందని డంబాలు పలికారు. మరి మిగులు ఉత్తపత్తి ఉంటే ఇప్పుడు ఈ సంక్షోభం ఎందుకు వచ్చిందో చెప్పాలి. ఇలాంటి చిల్లర విమర్శలు చేసేవారిని ప్రజలు ఓ కంటకనిపెడు తూనే ఉంటారు. కెసిఆర్ ధృఢచిత్తమే ఇప్పుడు తెలంగాణలో ప్రజలు, కర్షకులు, పారిశ్రామకవేత్తలకు భరోసాగా నిలచింది. విద్యుత్ సంక్షోభం ముచుకొస్తుందంటూ ఢల్లీి, ఎపి సిఎంలు ఆందోళన వ్యక్యం చేస్తూ ప్రధాని మోడీకి లేఖలు రాశారు. యూపిలో పలు ప్లాంట్లు మూతపడ్డాంటూ వార్తలు వచ్చాయి. బొగ్గు కొరత వల్ల ఉత్పత్తి పడిపోతోందని పలుప్రాంతాల నుంచి సమాచారం వస్తోంది. ఇదంతా పాలకుల దృష్టిలోపం, దార్శనికత లేని కారణమనే చెప్పాలి. బంగారు తెలంగాణ అంటే ఒక నెలలో వచ్చేది కాదని, అందుకు తొలుత వేసేది బాటలు మాత్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన నూటికి నూరుపాళ్లు నిజం. బంగారు తెలంగాణ అంటే అభివృద్దిని సాధించడం. అది గతాన్ని, ప్రస్తుతాన్నిపోల్చి చూడాల్సిన విషయం. గత పాలనలో కన్నా ఏదేని విషయంలో ముందుకు వెళుతున్నామా లేదా అన్నది లెక్క కట్టాలి. అందులొ అగ్రభాగంలో నిలిచేది విద్యుత్ రంగం. కరెంట్ కోతలతో నిరంతరంగా వెతలు పడ్డ తెలంగాణ ప్రజలు ఇప్పుడు కోతలు లేకుండా కరెంట్ వాడుతున్నారు. వ్యవసాయానికి కూడా నిరంతరంగా 24గంటల విద్యుత్ సరఫరా సాగుతోంది. ఈ దశలో నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం చేసిన కసరత్తు సత్ఫలితాలను ఇచ్చింది. ఇదే ఇప్పుడు దేశంలోని ఇతర రాష్టాల్రు ఆదర్శంగా తీసుకుని..ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే ఇవాళ సంక్షోభం వచ్చి ఉండేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఏలుబడిలో విద్యుత్ రంగం ఎంతగా దివాళా తీసిందీ, ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడ్డదీ తెలియంది కాదు. ఇప్పుడు విద్యుత్ విషయంలో ప్రజల నుంచి నిరసనలు లేదా ఆందోళనలు ఎక్కడా కానరావడం లేదు. అంటే ఓ రకంగా మనం అభివృద్ధిలో పయనిస్తున్నామని విమర్శకులు గుర్తించాలి. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో చేయని పనిని చేసి చూపిన ఘనత ఖచ్చింతంగా సిఎం కెసిఆర్‌కు దక్కుతుంది. విద్యుత్ రంగంలో తీసుకున్న చర్యలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవిగా చూడాలి. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఇచ్చి చూపారు. పారిశ్రామిక రంగం కూడా ఎంతో భరోసాతో ఉంది. ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంటే దానిని కూడా చాలామంది వ్యతిరేకించారు. అయినా అన్ని రంగాలకు నిరరాయంగా ప్రతి రోజూ 24గంటల విద్యుత్ ఇవ్వటం ద్వారా సిఎం కెసిఆర్ సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశంలో విద్యుత్ సంక్షోభం రావడంతో ఇప్పుడు కెసిఆర్ దార్శనికత ఏంటో తెలిసి వచ్చింది. బిజెపి నేతలు కూడా అదేపనిగా చేస్తున్న విమర్శలను కట్టిపెట్టి దేశంలో ఇలాంటి ప్రయోగానికి సిద్దపడాలి. 2018 జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభిస్తున్నట్లు చెప్పిన సిఎం ఇప్పటికీ ఎలాంటి కోతలు లేకుండా నిరంతరాయంగా సాగిస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు ప్రతి రోజూ 24గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా 24గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకపోవడం వల్ల నిరంతరం విద్యుత్ సరఫరాను కొనసాగించాలని నిర్ణయించారు. వ్యవసాయానికి ప్రతి రోజూ 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా అమల్లోకి వచ్చినప్పటి నుంచి రైతులకు జిల్లాలో ఎంత విద్యుత్ అవసరం అనే అంశంపై ఒక అంచనాకు వచ్చారు. వ్యవసాయానికి రైతులు ఎక్కువగా విద్యుత్‌ను వినియోగించే, తక్కువగా వాడే సమయంలో జిల్లాలకు ఎంత విద్యుత్ అవసరం అనేది క్షేత్రస్థాయిలో గుర్తించిన ఎన్‌పీడీసీఎల్ అధికారులు ఈ మేరకు నివేదికలు తయారు చేశారు. రైతులు తమ పంటలకు నీరందించటానికి ఎక్కువగా పంపుసెట్లను ఉపయోగించిన సమయంలో కూడా ప్రతి రోజూ వ్యవసాయానికి 24గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయవచ్చనే నిర్ధారణకు వచ్చారు. ఇందుకోసం అవసరమైన సబ్‌స్టేషన్‌లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు సిద్ధం చేశారు. 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొలువుదీరిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయటంతోపాటు ఏడు గంటల విద్యుత్‌ను తొమ్మిది గంటలకు పెంచింది. ఇందులో ఎక్కువగా పగలే సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ప్రతి రోజూ 24గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా జరగనున్నందున రైతులు ఆనందంగా ఉన్నారు. తమ పంపుసెట్ల వద్ద నిరంతరం పడిగాపులు పడే రోజులను రైతులు మరచి పోయారు. కోతలకు అనుగుణంగా ఇళ్లల్లో మిక్సీలు తిప్పుకునే తిప్పల నుంచి గృహిణులు బయటపడ్డారు. కోతలతో పరిశ్రమలు ఆగిపోతాయన్న భయం లేకుండా పారిశ్రామిక వేత్తలు ముందుకు సాగుతున్నారు. ఇది తెలంగాణ సిధించిన విద్యుత్ విజయంగా చూడాలి. కెసిఆర్ బాటలో కేంద్రంతో పాటు, ఇతర రాష్టాల్రు అధ్యయనం చేసి, ముందుకు సాగివుంటే ఇవాళ ఈ సంక్షోభం వచ్చేది కాదు. కెసిఆర్ దార్శనికతకు విద్యుత్ విజయం ఓ చరిత్రగా నిలిచిందనడంలో సందేహం లేదు.