కెసిఆర్ సొంత మిషన్లకే ప్రాధాన్యం
రైతు సంక్షేమం పట్టని సర్కార్
నిజామాబాద్,ఆగస్ట్7(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంపై శ్రద్ధ తీసుకున్నట్లయితే రైతులు ఆత్మహత్యలు ఉండేవి కావని కాంగ్రెస్ నేత,డిసిసి అధ్యక్షుడు మహ్మద్ హుడాన్ అన్నారు. పంటలకు అమ్ముకుందామన్నా ధరలు లేక రైతులు విలవిలలాడుతుంటే సిఎం కెసిఆర్ ఎందుకు సవిూక్షించడం లేదన్నారు. ఇటీవల మిర్చి, కంది రైతుల ఆందోళనలు కనిపించలేదా అని ప్రశ్నించారు. కేవలం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులకే పరిమితమవుతున్నారంటే రైతులపై ఉన్న ప్రత్యేక శ్రద్ధ ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత మాటలు విన్న రైతులు తాము పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేక కడుపుమండి రోడ్డెక్కుతున్నారని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, దళిత మైనార్టీలను కేవలం మాటలతో మభ్యపెట్టి మోసం చేస్తుందన్నారు.