కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక
విధానాల వలన దేశ భవిష్యత్తుకు ప్రమాదం హుజూర్ నగర్ మార్చి 11 ( జనంసాక్షి): కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు అన్నారు. శనివారం అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశం తంగిళ్ళ వెంకట చంద్ర అధ్యక్షతన జరిగిందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక, కర్షిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 ,26 వరకు సూర్యాపేట జిల్లాలో జన చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 29వ తేదీన హైదరాబాదులో జరిగే ముగింపు సభకు మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. మోడీ పాలనలో దేశ అప్పులు పెరిగిపోయాయని అన్నారు. మోడీ ప్రభుత్వం ఆదాని, అంబానీల కోసమే పరిపాలన చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం, మండల కార్యదర్శి పోషణ బోయిన హుస్సేన్, మండల కమిటీ సభ్యులు చింతకుంట్ల వీరయ్య, పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, నూకల లక్ష్మీ, నరసమ్మ , చందాల బిక్షం, సిద్దిల వెంకటయ్య, షేక్.ఖాసిం తదితరులు పాల్గొన్నారు.