కేంద్రం మాట తప్పితే ప్రజాస్వామ్య

స్ఫూర్తి కొరవడ్తది : పొన్నం
హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం మాట తప్పితే ప్రజాస్వామ్యంలో స్ఫూర్తి కొరవడుతుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై గడువు విధించింది షిండేఅని, తాము కాదని చెప్పారు. గడువు ముగిశాక రాష్ట్ర నేతలను ఢిల్లీకి రానివ్వడం సరికాదన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో తమ తడాఖా ఏమిటో చూపిస్తామన్నారు. ప్రభుత్వ నాన్చివేత ధోరణితో ప్రజల్లో తిరగలేకపోతున్నామని, వెంటనే డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి ఉండి తెలంగాణ ప్రకటించాలని కోరారు. తెలంగాణ ప్రజలందరి మనోభావాలను గుర్తించకపోతే ఈ ప్రాంతంలో పార్టీ మనుగడ కష్టమని చెప్పారు. తెలంగాణపై చర్చలు కొనసాగుతున్నాయని, ఇందుకు స్పష్టమైన గడువు లేదంటూ షిండే ప్రకటించడం సరికాదన్నారు. సీమాంధ్ర నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేయడం దురదృష్టక రమన్నారు. ఈ ప్రాంత ప్రజలుకోరు కుంటున్నది స్పష్టమైన నిర్ణయమని తెలిపారు.