కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం
బాలికల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంపు
కేబినేట్ ఆమోదంతో త్వరలోనే చట్టంగా మార్పు
న్యూఢల్లీి,డిసెంబర్16(జనం సాక్షి): బేటీపడావో ..బటీ బచావో నినాదంతో ముందుకు వచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వం మరో కీలకనిర్ణయం తీసుకున్నారు. మహిళల వివాహ వయస్సును పెంచడం ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని సంకల్పించారు. వారి ఆరోగ్యానికి కూడా భరోసా ఇచ్చారు. పురుషు లతో సమానంగా మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే ప్రతిపాద నకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. కేబినెట్ ఆమోదం తర్వాత, ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006కి సవరణను ప్రవేశపెట్టనుంది. వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం, 1955 వంటి వ్యక్తిగత చట్టాలకు సవరణలు తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బుధవారం క్లియరెన్స్ జయ జైట్లీ నేతృత్వంలోని కేంద్రం టాస్క్‌ఫోర్స్ 2020 డిసెంబర్‌లో నీతి ఆయోగ్‌కి సమర్పించి న సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మాతృత్వ వయస్సు, మరణాల రేటు, పోషకాహార స్థాయిల మెరుగుదల వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చింది. నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిగిన తర్వాతే అని పలు సిఫార్సులు చేశామని జైట్లీ చెప్పారు. మేము 16 విశ్వవిద్యాలయాల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం. 15 కంటే ఎక్కువ ఔఉక్షలు, ముఖ్యంగా గ్రావిూణ, అట్టడుగు వర్గాలకు చెందిన వారు, బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న రాజస్థాన్‌లోని ప్రత్యేక జిల్లాల్లో అభిప్రాయాలు సేకరించాం. అని జైట్లీ వివరించారు. వివాహ వయస్సు 22`23 సంవత్సరాలు ఉండాలని చాలా మంది అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. ఈ మేరకునివదేఇకను కేంద్రానికి అందచేశారు. దీంతో మహిళల వివాహ వయస్సును పెంచాలని నిర్ణయించారు. దీంతో వారి విద్యకు కూడా అవకాశం ఏర్పడిరది.
“““`