కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ ధర్నా
జనగామ (జనం సాక్షి)జూలై20:కేంద్ర ప్రభుత్వం దేశంలోని సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తా ఆవరణలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ .మరియు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పేద ప్రజల నడ్డి విరుస్తోంది.పాలు, పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీ పెంచి సామాన్య ప్రజలపై కేంద్రం పెను భారం మోపుతోంది.ఇప్పటికే పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం… దేశంలో పేద, మధ్యతరగతి ప్రజలు బ్రతకలేని పరిస్థితికి తీసుకువచ్చించింది.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పుట్టిన పిల్లల నుండి శ్మశాన వాటికకు వెళ్లే మనిషి వరకు అన్నింటిపై పన్ను విధిస్తోంది…. చిన్న పిల్లలు తాగే పాలపైన కూడా పన్ను వేసే బీజేపీ ప్రభుత్వ పాలసీని తీవ్రంగా ఖండిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు రమణ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి – అంజయ్య, ఎంపిపి కళింగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ – సిద్దిలింగం, మున్సిపల్ చైర్మన్ జమున – లింగయ్య, మండల పార్టీ అధ్యక్షులు యాదగిరి, పట్టణ అధ్యక్షులు సురేష్ రెడ్డి, మహిళ పట్టణ అధ్యక్షురాలు పల్లవి, మున్సిపల్ కౌన్సిలర్లు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, మహిళ నాయకురాలు, యువజన నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.