కేంద్ర ప్రభుత్వ విధానాలతో పేద మధ్యతరగతి జీవితాలు చిన్నాభిన్నం
– సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద మధ్యతరగతి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు.శుక్రవారం స్థానిక కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం భవనంలో సీపీఐ 24వ జాతీయ మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలపై ఈ మహాసభలలో దిశానిర్దేశం జరగనున్నట్లు తెలిపారు.అంబానీ, ఆదానీ లను ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టటమే ఏకైక లక్ష్యంతో పీఎం మోడీ పని చేస్తున్నారని విమర్శించారు.ఫాసిస్టు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజా కంఠపాలన కొనసాగిస్తున్నారని అన్నారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేసేందుకు ఈ మహాసభలు తోడ్పడునున్నాయని చెప్పారు.సీపీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అనంతుల మల్లేశ్వరి, జిల్లా రైతు సంఘం గౌరవ అధ్యక్షులు మూరగుండ్ల లక్ష్మయ్య , పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు , ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి , పట్టణ నాయకులు నిమ్మల ప్రభాకర్, పెండ్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Attachments area