కేంద్ర సర్కార్‌ నూతన..

 

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 31 (జనంసాక్షి) :

కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా నగదు బదిలీ పథకాన్ని దేశంలో మంగళవారం ప్రారంభించనుంది. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం ఈ విషయాన్ని వెల్లడించారు. మొదట దేశవ్యాప్తంగా

20 జిల్లాల్లో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నాటికి మరో 11 జిల్లాలో, మార్చి ఒటిన 12 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. మన రాష్ట్రంలోని అనంతపూర్‌ జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అయితే దేశవ్యాప్తంగా 54 జిల్లాల్లో మొదటి విడతలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని సంకల్పించిన ఆధార్‌ కార్డులో జారీలో లోపాలతో 20 జిల్లాలకే పరిమితం చేశారు. దీనిపై ప్రధాని ఎన్నిసార్లు అన్ని శాఖల అధికారులు, మంత్రులతో సమావేశాలు నిర్వహించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎంతో అట్టహాసంగా ప్రారంభించాలనుకున్న కార్యక్రమాన్ని కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం చేశారు.