కేంద్ర సొమ్ముంతో..
రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిపొందుతుంది
ప్రధాని మోదీపై దుష్పచారం చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుంది
మోదీ చంద్రబాబులా మామకు వెన్నుపోటు పొడిచి సీఎం, పీఎం పీఠాలెక్కలేదు
రాష్ట్రంలో అవినీతిని నిరూపిస్తాం
విూడియా ప్రతినిధుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ
విజయనగరం, జూన్23(జనం సాక్షి) : కేంద్రం సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిపొందుతూ మళ్లీ కేంద్రంపైనే చంద్రబాబు తిరుగుబాటు చేయడం విడ్డూరంగా ఉందని ఆంధప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం విూడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్న చందాన కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి పొందుతోందన్నారు. ప్రధాన మంత్రి రాష్ట్రానికి ఏవిూ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం దుష్పచ్రారం చేస్తోందని ఆరోపించారు. ప్రత్యేక ¬దా విషయంలో 5 వేల కోట్ల రూపాయలు, ప్రత్యేక ప్యాకేజి 16000 కోట్ల రూపాయలు ఒప్పుకున్న మాట అవాస్తవమా అని ప్రశ్నించారు. విశాఖపట్నం రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు సంబంధించి విభజన చట్టంలో పరిశీలన చేయమని ఉందని, కృష్ణమరాజ పట్నం పోర్టుతో సీఎం చంద్రబాబు బేరం కుదుర్చుకుని… ఇప్పుడు దుగరాజపట్నం పోర్టు కావాలంటున్నారని తెలిపారు.
సాక్షర భారత్ ప్రాజెక్టును కొత్త పథకంలో విలీనం చేసినందున.. కొత్త ప్రపోజల్స్ పెట్టమంటే.. పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 20వేల మంది ఉద్యోగాలు పోయాయన్నారు. చంద్రబాబు నిజం మాట్లాడరు.. ఆయనకు ముని శాపం ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మానవహక్కులకు భంగం వాటిల్లుతోందని, వాటిని కాపాడతామని అన్నారు. చంద్రబాబుకు మానసిక పరిస్థితి బాగాలేదని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రబాబు లాగా మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్య మంత్రి, ప్రధానమంత్రి కాలేదని, ప్రజల సహకారంతో కష్టపడి ప్రధాన మంత్రి అయ్యారని పేర్కొన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అవినీతిని నిరూపిస్తానని.. అలాకాకపోతే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వైసీపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీ.. తాము వైసీపీతో కుమ్మక్కయ్యామనడం హాస్యాస్పదమని అన్నారు. కడపకు స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని ఏపీ అధికారులే ‘సెయిల్’కు నివేదిక ఇచ్చారని అన్నారు. ఇప్పుడు ధర్నా అంటూ కొత్త నాటకానికి తెర లేపారని విమర్శించారు. కోట్లు పెట్ట దీక్షలు చేసే చంద్రబాబు..నాయీ బ్రాహ్మణులు కనీస వేతనం అడిగితే మాత్రం తోకలు కట్ చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని అన్నారు.