కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన సోనియా
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం విదితమే. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యాక్షుడు రాహుల్‌గాంధీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు ఆప్‌కు తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. ఆప్ ఇప్పటికే 56 స్థానాల్లో గెలుపొందింది. మరో 11 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మాత్రం ఖాతా కూడా తెరువలేదు. బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందింది.