కేజ్రీవాల్ కొత్తపార్టీ పేరు ఆమ్‌ఆద్మీ
రాజకీయాలతో సంబంధం లేదు
అన్ని పార్టీలు ప్రజలను మోసం చేశాయి
మా పార్టీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతుంది
ఢిల్లీ: నవంబర్ 24, (జనంసాక్షి):
కొత్తపార్టీ ప్రకటించిన అనంతరం కేజ్రీవాల్ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మాకు రాజకీయాలతో సంబంధంలేదని మేం సమన్య పౌరులమని ఆయన అన్నారు. రేపు జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నాలో పాల్గొనే ప్రతి ఒక్కరు మా పార్టీ సభ్యులేనని పేర్కొన్నారు. అన్ని పార్టీలు ప్రజలను మోసం చేశాయని దేశంలోని అన్ని పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని మా పార్టీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతుందని మైనార్టీ, ఓబీసీలకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తామన్నారు. . 25 మంది తో కోర్ కమిటీని 350మందితో జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీని లాంచనంగా సోమావారం ఢీల్లీలోని జంతర్‌మంతర ్‌వద్ద ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతరం నాయకులపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తమ పార్టీ పూర్ణ స్వరాజ్యం తీసుకొస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.