కేజ్రీవాల్ పార్టీపేరు ‘ఆమ్ ఆద్మీ’ఔ
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ తన నూతన రాజకీయ పక్షానికి ‘ఆమ్ అద్మీ’ అని పేరు పెట్టారు .సామాన్యుడిని గుర్తుకు తెచ్చే రీతిలో పార్టీ పేరును పెడుతున్నట్టు వెల్లడించారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న మాయంక్‌గాంధీ ఈ పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. పార్టీలో ఎలాంటి హైకమాండ్ ఉండదని సామాన్యులే హైకమాండ్‌గా వ్యవహరిస్తారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన నూతన ప్రవర్తనా నియమావళిని కూడా కేజ్రీవాల్… తదితరులు ఆమోదించారు.