కేటీపీఎన్‌లో ఒప్పంద కార్మికుల ఆందోళన

వరంగల్‌: భూపాలపల్లి కేటీపీఎన్‌లో ఒప్పంద కార్మికులు ఆందోళనలను ఉద్దృతం చేశారు. ఈ ఉదయం కేటీపీఎన్‌ ప్రధాన మార్గంలో భైఠాయించిన కార్మికులు బొగ్గు లారీలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు కేటీపీఎన్‌ వద్ద భారీగా మోహరించి కార్మికులను అడ్డుకుంటున్నారు.