కేతకి ఆలయంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ నాయకులు పూజలు
ఝరాసంగం అక్టోబర్ 9( జనంసాక్షి)
రజక సంఘం అధ్యక్షుడు దత్తు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ చైర్మన్ కనక చంద్రం లు కేతకి సంగమేశ్వర ఆలయం ఝరా సంఘం సందర్శించడం జరిగింది అనంతరం ఆలయ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశం లో జేఏసీ చైర్మన్ కనక చంద్రం మాట్లాడుతూ ఆలయం చాలా ప్రతిష్టాత్మకమైందని ఈరోజు ఈ ఆలయాన్ని సందర్శించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ త్వరలోనే రెగ్యులరైజ్ కావాలని కేతకి సంగమేశ్వర స్వామిని కోరుకున్నారు
కాంట్రాక్టు లెక్చరర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిద్ధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప ఆలయం అని ఆలయాన్ని సందర్శించి నా భక్తులు కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయి అని తెలిపారు. దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఒక హోటల్ లో సుశీల అల్పాహారం చేయడం జరిగింది ఇది ఎంతో రుచికరంగా ఉందని తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్ అధికార ప్రతినిధి నంట శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గిరి రవి మరియు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్ జిల్లా నాయకులు యాదగిరి తిరుపతి సాయి ప్రసాద్, రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి చేర్యాల రవి తదితరులు పాల్గొన్నారు