కేరళకు ప్రత్యేక రైళ్లు

వరదల తీవ్రత కారణంగా నిర్ణయం

విశాఖపట్నం,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కేరళలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దువ్వాడ, విజయనగరం విూదుగా త్రివేండ్రం-సిల్చార్‌కు, విశాఖ విూదుగా కొచ్చివేలి-భువనేశ్వర్‌కు ప్రత్యేక రైలు సర్వీసులను నడపుతున్నట్లు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు. కొచ్చివేలి-భువనేశ్వర్‌ (06336) : ఈ రైలు ఈ నెల 20న ఉదయం 11 గంటలకు కొచ్చివేలిలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.35 గంటలకు విశాఖ వస్తుంది. ఇక్కడి నుంచి 8.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3.45 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఈ రైలు దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బ్రహ్మపుర, ఖుర్దారోడ్‌ విూదుగా ప్రయాణం సాగిస్తుంది. త్రివేండ్రం-సిల్చార్‌ (02515) : ఈ రైలు ఈ నెల 20న మధ్యాహ్నం 12.45 గంటలకు త్రివేండ్రంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.03 గంటలకు దువ్వాడ వస్తుంది. ఇక్కడి నుంచి 8.05 గంటలకు బయలుదేరి గురువారం సాయంత్రం 5.30 గంటలకు సిల్చార్‌ చేరుకుంటుంది. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఈ రైలు దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బ్రహ్మపుర, ఖుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, భద్రక్‌ విూదుగా ప్రయాణం చేస్తుంది.

 

 

తాజావార్తలు