కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. కేరళ, కోస్తా కర్ణాటక, లక్షదీవ్ అండమాన్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అక్కడక్కడ వర్షాలు పడనున్నట్లు చెప్పారు.