కేరళ వరదబాధితుల కోసం సామాగ్రి సేకరణ
శ్రీకాకుళం,ఆగస్ట్21(జనం సాక్షి): సిఐటియు ఆలిండియా కమిటీ పిలుపు మేరకు మంగళవారం సిఐటియు శ్రీకాకుళం జిల్లా కమిటీ బృందం కేరళ వరద బాధితుల సహాయార్ధం మొదట విడతగా రూ.1,10,800 విలువ చేసే షర్టులు, చీరలు, దుప్పట్లు, లుంగీలు, పిల్లల బట్టలు, తదితర వస్తుసామాగ్రిని సేకరించారు. శ్రీకాకుళం సిఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.శ్రీనివాస్, బి.గోవిందరావుల ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కమిటీ ప్రతినిధులు కలిసి కేరళ వరద బాధితుల సహాయార్థం సేకరించిన దుస్తులు, ఇతర సామాగ్రిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
—————