కేవీకే లో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం వేడుక
జాతీయ రాజ్యాంగ దినోత్సవం వేడుక లను మండలంలోని గడ్డిపల్లి కేవీకే లో శనివారం ఘనంగా నిర్వహించినట్లు ఇంఛార్జి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి. లవ కుమార్ తెలిపారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డా: బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. అనంతరం కెవికె లో శిక్షణ పొందుతున్న యువత, విద్యార్థుల నుద్దేశించి డా: బాబా సాహెబ్ అంబేద్కర్ చేతి తో రాసి రూపొందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద దని దీనికి ప్రతి ఒక్కరూ కట్టు బడి ఉండాలని అన్నారు. అమృత్ కాల్ వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా పవిత్ర రాజ్యాంగ స్ఫూర్తి వల్ల దేశ పౌరులందరి ఆత్మ గౌరవం సంక్షేమం ఆకలి దారిద్రం వెనుకబాటు తనం భిన్నత్వంలో ఏకత్వము సాధించగలిగామని దీనిపై యువతకు అవగాహన కలిపంచాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందుతున్న రణపంగా రాజేష్, శ్రవణ్ లు మాట్లాడుతూ డా బాబా సాహెబ్ అంబేద్కర్ అతి నిరుపేద కుటుంబంలో పుట్టి రాజ్యాంగాన్ని రచించి దేశంలో ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు ఏ కిరణ్, డి ఆదర్శ్, డి నరేష్, ఏ నరేష్, డా టి మాధురి, ఎన్ సుగంధి లతో పాటు దివ్య, హర్షిని శిక్షణ పొందుతున్న యువత, విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.