-కేసిఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు కు పట్టిన గతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు పట్టిస్తారు.
-తెలంగాణ వచ్చినా పాలమూరు వలసలు ఆగలేదు.
-టిజెఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్యాంప్రసాద్ రెడ్డి.
-ఈనెల 25న జనసమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం.
-మద్దతు తెలిపిన వివిధ పార్టీలు,ప్రజాసం ఘాలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు20(జనంసాక్షి):
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు కాలేశ్వరం ప్రాజెక్టు కు పట్టిన గతే పట్టిస్తారని తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్యాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు.టిజెఎస్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో ని సిఎన్ రెడ్డి సేవా సదన్ గార్డెన్స్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో
ఈనెల 25వ తేదీన తెలంగాణ జన సమితి (టిజెఎస్) పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్,బి ఎస్ పి, జనసేన, సిపిఐ, సిపిఎం, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు,మైనారిటీ ఫోరం, బీసీ విద్యార్థి విభాగం, ఎరుకల సంఘం నాయకులు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 25 న స్థానిక సిఎన్ రెడ్డి గార్డెన్స్ లో రాజకీయాలకు అతీతంగా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ హాజరవుతారని తెలిపారు.అదేవిధంగా మద్దతు తెలిపిన అన్ని పార్టీలు, ప్రజా సంఘాల జిల్లా అధ్యక్షులు హాజరవుతారని అన్నారు.పాలమూరు రంగారెడ్డి పనులు నాణ్యత పాటించే విధంగా, నల్ల మట్టిని అరికట్టే విధంగా, ఆరు సంవత్సరాలు అయినప్పటికీ ప్రాజెక్టుల నిర్మాణం కనీసం 50 శాతం పనులు పూర్తి కాలేదని నాణ్యత లేని పనుల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు పట్టిన గతి పాలమూరు ప్రాజెక్టుకు పట్టకుండా ఉండేందుకే ఈ యొక్క అఖిలపక్ష సమావేశం సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు.తెలంగాణ వచ్చినా ఉమ్మడి పాలమూరు జిల్లా లో వలసలు ఆగలేదని అన్నారు.పాలమూరు పేదలు నేటికీ బొంబాయి కి కూలీపనులకు వలస వెళ్ళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎల్లూరులో జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో లిఫ్ట్ తెగి చనిపోయిన కార్మికులకు బాసటగా నిలువాల్సిన అవసరం ఉందని అన్నారు. మెగా కృష్ణారెడ్డి కంపెనీల అభివృద్ధి కోసమే కేసీఆర్ ప్రాజెక్టులను చేపట్టారని మండిపడ్డారు.కావునా ఈనెల 25వ తారీకు న జరిగే అఖిలపక్ష సమావేశాన్ని అన్ని పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మేధావులు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాంట్రాక్టర్ల కమీషన్ల కోసమే ప్రాజెక్టులు:
ఎంఆర్పీస్ రాష్ట్ర నాయకులు గూటవిజయ్..
ఈ సమావేశంలో ఎంఆర్పీస్ రాష్ట్ర నాయకులు గూటవిజయ్ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి,వట్టెం రిజర్వాయర్ నిర్మాణాలు కాంట్రాక్టర్ల కమీషన్ల కోసమే కానీ ప్రజలకు మేలు కోసం కాదని అన్నారు.కావునా వాటిని ప్రజలతో కలిసి పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఆర్థిక దోపిడిని అరికట్టాలి:
బిఎస్పీ జిల్లా కార్యదర్శి రాంచందర్..
బిఎస్పీ జిల్లా కార్యదర్శి రాంచందర్ మాట్లాడుతూ నియోజకవర్గం లో నల్లమట్టి కుంభకోణం లో జరుగుతున్న ఆర్థిక దోపిడిని అరికట్టాలని అన్నారు.
అవినీతిని ఐక్యత తో ఎదురించాలి:
జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ అరవింద్ చారి..
సమావేశంలో జాతీయ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ అరవింద్ చారి మాట్లాడుతూ
ప్రాజెక్టుల నిర్మాణం లో జరుగుతున్న అవినీతిని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి ఐక్యత తో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
బిజెపి ఎందుకు స్పందించడం లేదు:
సిపిఎం మండలం కార్యదర్శి అశోక్..
సిపిఎం మండల కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న నల్లమట్టి తరలింపు విషయం లో బిజెపి పార్టీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.పాలమూరు ప్రాజెక్టు పనుల్లో నాణ్యత ప్రమాణాలపై జిల్లా లోని మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతి పై పోరాటాలు చేస్తుంటే టిఆర్ఎస్ నాయకులు పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఈ విలేకరుల సమావేశంలో బి ఎస్ పి పార్టీ కోఆర్డినేటర్ బోనాసి రామ్ చందర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గూట విజయ్,జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కురుమయ్య, జాతీయ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ అరవింద్ చారి,సిపిఎం మండలం కార్యదర్శి అశోక్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తగిలి శ్రీనివాసు లు,మల్లేష్ యాదవ్,సిపిఐ నాయకులు షేక్ మహమ్మద్ ఫయాజ్, వై ఎస్ ఆర్ సి పి నాయకులు ఎం. లక్ష్మయ్య, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కూరాకుల శ్రీనివాస్,వంగ లక్ష్మణ్,శ్రీనివాస్,ఎంఏ ఎంహెచ్ఎస్ఎస్ ప్రెసిడెంట్ నిజాం తదితరులు పాల్గొన్నారు.